సత్యన్‌... కొత్త చరిత్ర | G Sathiyan becomes first Indian to break into top-25 of table tennis world rankings | Sakshi
Sakshi News home page

సత్యన్‌... కొత్త చరిత్ర

Apr 30 2019 12:51 AM | Updated on Apr 30 2019 12:51 AM

G Sathiyan becomes first Indian to break into top-25 of table tennis world rankings - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ర్యాంకింగ్స్‌లో టాప్‌–25లో చోటు సంపాదించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్‌ సత్యన్‌ గుర్తింపు పొందాడు. సోమవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో చెన్నైకు చెందిన సత్యన్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

హంగేరిలో గత వారం ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్యన్‌ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ‘నా ప్రదర్శనతో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈ ఏడాది చివరికల్లా టాప్‌–15లోకి చేరడమే నా లక్ష్యం’ అని సత్యన్‌ అన్నాడు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement