గందరగోళ పరిస్థితుల మధ్య ప్రారంభమైన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్) తొలి సీజన్‌లో ముంబై గరుడ 5-2తో పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది
ప్రొ రెజ్లింగ్ లీగ్
Dec 11 2015 2:43 AM | Updated on Sep 3 2017 1:47 PM
పంజాబ్‌ను ఓడించిన ముంబై
న్యూఢిల్లీ: గందరగోళ పరిస్థితుల మధ్య ప్రారంభమైన ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యుఎల్) తొలి సీజన్‌లో ముంబై గరుడ 5-2తో పంజాబ్ రాయల్స్‌ను ఓడించింది. మహిళల 58కేజీ విభాగంలో పంజాబ్ స్టార్ రెజ్లర్ గీతా ఫోగట్‌కు ఊహించని పరాజయం ఎదురైంది. ముంబై గరుడకు చెందిన సాక్షి మాలిక్ చేతిలో తను పరాజయం పాలైంది. 8-8తో ఈ బౌట్ సమానంగా నిలిచినా సాక్షి వరుసగా ఎక్కువ పాయింట్లు సాధించడంతో విజేతగా నిలిచింది. తొలి బౌట్‌లో చీర్‌లీడర్స్‌కు ఎక్కడ నిలబడాలో తెలీకపోవడం, మిగతావారు చుట్టూ మూగడంతో బౌట్ ఆరంభమైన 19 సెకన్లకే రిఫరీ ఆపివేశారు. కొన్ని బౌట్లలో గడియారాలు పనిచేయలేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్ వారియర్స్ తరఫున ఆడాల్సిన రెజ్లర్ సుశీల్ కుమార్ నిర్వాహకుల వైఖరితో విసిగి లీగ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో పీడబ్ల్యుఎల్ కళ తప్పినట్టయ్యింది.
Advertisement
Advertisement