రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో ఓ శకం ముగిసింది. కొలనులో బంగారు పతకాల పంట పండించిన దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్ ఘనంగా కెరీర్‌కు ముగింపు పలికాడు. 4x100 మీటర్ల మెడ్లే రిలేలో మొదటి స్థానంలో నిలిచి మొత్తం 23 ఒలింపిక్స్ స్వర్ణాలతో మానవమాత్రుడికి సాధ్యంకాని రికార్డుతో కెరీర్‌కు వీడ్కోలు చెప్పాడు. ఆదివారం జరిగిన చివరి ఈవెంట్లో స్వర్ణం గెలవగానే ఫెల్ప్స్ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘అచ్చం ఇలాగే నా కెరీర్ ముగించాలనుకున్నా.
నా కల నేరవేర్చుకున్నా. చివరిసారిగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు కాస్త ఉద్వేగం కలిగింది. బాల్యంలో ఉన్నప్పుడు ఓ చిన్న కలతో మొదలైన నా ప్రస్థానంతో స్విమ్మింగ్‌కు గతంలో ఎవరూ చేయనంతగా చేయాలనుకున్నా. అనుకున్నది సాధించా’ అని ఫెల్ప్స్ తెలిపాడు. రియో ఆఖరి పోటీని చూసేందుకు భారీ సంఖ్యలో స్విమ్మింగ్ స్టార్స్ అందరూ వచ్చారు. గ్యాలరీలో కూర్చున్న ఫెల్ప్స్ తల్లి కన్నీటిపర్యంతమయ్యారు. పతకం అందుకున్నాక ఫెల్ప్స్ కూడా తన క న్నీటిని ఆపుకోలేకపోయాడు.
అమెరికా ‘థౌజండ్’ వాలా
మహిళల 4x100 మీటర్ల మెడ్లే రిలేలో అమెరికా మహిళల జట్టు (సిమోన్ మాన్యుయేల్, కేథలీన్ బేకర్, లిల్లీ కింగ్, దానా వోల్మర్) స్వర్ణం గెలిచింది. ఈ విజయంతో మొత్తం ఒలింపిక్స్ చరిత్రలో వెయ్యి స్వర్ణ పతకాలు గెలిచిన (1896 ఏథెన్స్ నుంచి 2016 రియో వరకు) జట్టుగా అమెరికా చరిత్ర సృష్టించింది. మరోవైపు 50 మీటర్ల ఫ్రీస్టయిల్లోనూ అమెరికా స్విమ్మర్ సిమోన్ మాన్యుయేల్ స్వర్ణం చేజిక్కించుకుంది.
‘కల నెరవేరింది’
Published Mon, Aug 15 2016 2:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement