దక్షిణాఫ్రికా ఛేదించేనా?

England Set Target of 312 Runs Against South Africa - Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 312 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టులో జేసన్‌ రాయ్‌(54: 53 బంతుల్లో 8 ఫోర్లు), జో రూట్‌(51: 59 బంతుల్లో 5 ఫోర్లు), ఇయాన్‌ మోర్గాన్‌(57: 60 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), బెన్‌ స్టోక్స్‌( 89: 79 బంతుల్లో 9 ఫోర్లు)లు రాణించి జట్టు మూడొందలకు పైగా స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెయిర్‌ స్టో తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ జేసన్‌ రాయ్‌, జో రూట్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 106 పరుగులు సాధించిన తర్వాత జేసన్‌ రాయ్‌ పెవిలియన్‌ చేరగా, ఆపై స్వల్ప వ్యవధిలో రూట్‌ కూడా ఔటయ్యాడు. ఆ తరుణంలో మోర్గాన్‌-బెన్‌ స్టోక్స్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టే బాధ్యతను తీసుకుంది.
(ఇక్కడ చదవండి:  పన్నెండో ప్రపంచ యుద్ధం)

వీరిద్దరూ మరో 106 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసి గాడిలో పెట్టారు. కాగా, మోర్గాన్‌ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత జోస్‌ బట్లర్‌(18), మొయిన్‌ అలీ(3)లు నిరాశపరచడంతో ఇంగ్లండ్‌ తడబడినట్లు కనిపించింది. అయితే బెన్‌ స్టోక్స్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి జట్టును మూడొందలకు చేర్చిన తర్వాత పెవిలియన్‌ చేరాడు. స్కోరును పెంచే క్రమంలో స్టోక్స్‌ 49 ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. చివరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్‌(7 నాటౌట్‌), ప్లంకెట్‌(9 నాటౌట్‌)లు 11 పరుగులు సాధించడంతో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.

ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాక్‌
ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్‌ ఇచ్చాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌. తొలి ఓవర్‌ వేసిన తాహీర్‌ బౌలింగ్‌లో ఇంగ్లిష్‌ ఓపెనర్‌ బెయర్‌ స్టో పరుగులేమీ చేయకుండా గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేరాడు.  తాహీర్‌ వేసిన గుడ్‌ లెంగ్త్‌ బంతికి తడబడిన బెయిర్‌ స్టో.. సఫారీ కీపర్‌ డీకాక్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.


రెండు ‘సెంచరీ’ భాగస్వామ్యాలు
ఇంగ్లండ్‌ రెండు సెంచరీకి పైగా భాగస్వామ్యాలు సాధించింది. ముందుగా జేసన్‌ రాయ్‌-జోరూట్‌ల జోడి సెంచరీ భాగస్వామ్యాన్ని సాధిస్తే, ఆపై ఇయాన్‌ మోర్గాన్‌-బెన్‌ స్టోక్స్‌ల జంట సెంచరీ భాగస్వామ్యాన్ని జత చేసింది. ఈ రెండు జోడీలు 106 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడం ఇక్కడ విశేషం. అదే సమయంలో ఇంగ్లండ్‌ జట్టులో నాలుగు హాఫ్‌ సెంచరీలు నమోదయ్యాయి. ఇలా ఒక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో నలుగురు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు హాఫ్‌ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌ జట్టును సఫారీలు కట్టడి చేశారనే చెప్పాలి. ఓ దశలో ఇంగ్లండ్‌ 350కి పైగా పరుగులు సాధించే అవకాశం ఉందని అంతా భావించినా సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. బట్లర్‌, మొయిన్‌ అలీ వికెట్లను స్వల్ప విరామాల్లో సాధించి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచింది. దాంతో ఇంగ్లండ్‌ ఆఖరి ఓవర్లలో నెమ్మదిగా బ్యాటింగ్‌ చేసింది. చివరి పది ఓవర్లలో 76 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌ నాలుగు వికెట్లు సమర్పించుకుంది.  సఫారీ బౌలర్లలో ఎన్‌గిడి మూడు వికెట్లు సాధించగా,రబడా, తాహీర్‌లకు తలో రెండు వికెట్లు లభించాయి. ఫెహ్లుకోవియా వికెట్‌ తీశాడు.
(ఇక్కడ చదవండి: వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ తొలిసారి..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

15-07-2019
Jul 15, 2019, 00:01 IST
లండన్‌ : ఫైనల్‌ మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌తో ఫలితం తేలనుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ బౌల్‌​ వేసిన...
14-07-2019
Jul 14, 2019, 20:42 IST
లండన్‌: న్యూజిలాండ్‌ పేసర్‌ మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. తాజా వరల్డ్‌కప్‌లో తొలి పవర్‌ ప్లేలో అత్యధిక వికెట్లు...
14-07-2019
Jul 14, 2019, 19:24 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా  ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న తుది పోరులో న్యూజిలాండ్‌ 242 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  హెన్రీ...
14-07-2019
Jul 14, 2019, 17:04 IST
లండన్‌: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సరికొత్త వరల్డ్‌ రికార్డు సాధించాడు. ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు...
14-07-2019
Jul 14, 2019, 16:37 IST
న్యూఢిల్లీ:  టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తన రిటైర్మెంట్‌కు సంబంధించి ఏమైనా ఆలోచన ఉంటే దాన్ని మానుకోవాలని ఇప్పటికే...
14-07-2019
Jul 14, 2019, 15:33 IST
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా తన ప్రస్థానాన్ని సెమీస్‌లోనే ముగించడంపై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ పెదవి విప్పాడు. భారత...
14-07-2019
Jul 14, 2019, 14:33 IST
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌ జరిగిన వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుత పోరాటంతో టీమిండియాను విజయం అంచున నిలబెట్టాడు. ...
14-07-2019
Jul 14, 2019, 10:14 IST
మా అమ్మ బుమ్రా బౌలింగ్‌ శైలిని అనుకరించారు
14-07-2019
Jul 14, 2019, 05:30 IST
ప్రారంభంలో చప్పగా సాగుతోందన్నారు వారాలు గడుస్తున్నా ఊపు లేదన్నారు మ్యాచ్‌లు తరుగుతున్నా మజా ఏదన్నారు మధ్యలోకి వచ్చేసరికి కాక మొదలైంది...
13-07-2019
Jul 13, 2019, 19:57 IST
లండన్‌: సెమీస్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ సగర్వంగా అడుగుపెట్టింది. క్రికెట్‌ విశ్వసమరంలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన ఇంగ్లండ్‌...
13-07-2019
Jul 13, 2019, 19:23 IST
బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ జట్టు ఒకే ఒక్క చెత్త ప్రదర్శనతోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమణకు కారణమైందని ఆ...
13-07-2019
Jul 13, 2019, 18:47 IST
లండన్‌: మీడియా హడావుడి లేదు. అభిమానుల తాకిడి లేదు. ఒంటరిగా.. ప్రశాంతంగా, ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా సాధారణ రైలు ప్రయాణం చేశాడు...
13-07-2019
Jul 13, 2019, 18:30 IST
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌ నుంచి నిష్క్రమించడంతో అది విరాట్‌ కోహ్లి కెప్టెన్సీపై ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి....
13-07-2019
Jul 13, 2019, 17:31 IST
లండన్‌: స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్‌ను సాధించి తమ చిరకాల కోరిక తీర్చుకోవాలని ఆశ పడుతోంది ఇంగ్లండ్‌. 27 ఏళ్ల తర్వాత...
13-07-2019
Jul 13, 2019, 17:27 IST
హైదరాబాద్ ‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి, మాజీ లెజెండ్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌లు దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌కు...
13-07-2019
Jul 13, 2019, 16:38 IST
సిడ్నీ:  వన్డే వరల్డ్‌కప్‌లో అసలు సిసలు సమరానికి వచ్చేసరికి ఆసీస్‌ తేలిపోవడంపై ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్‌ బోర్డర్‌...
13-07-2019
Jul 13, 2019, 15:38 IST
మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగి సెమీస్‌లోనే తమ ప్రస్థానాన్ని ముగించి స్వదేశానికి తిరిగి పయనమయ్యేందుకు సిద్ధమైంది....
13-07-2019
Jul 13, 2019, 14:58 IST
న్యూజిలాండ్‌ కెప్టెన్‌  కేన్‌ విలియమ్సన్‌ వన్డే ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించడానికి ఒక్క పరుగు దూరంలో నిలిచాడు.
13-07-2019
Jul 13, 2019, 14:43 IST
కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా వరల్డ్‌కప్‌ జట్టులో తాను పునరాగమనం కోసం ప్రయత్నం చేశాననే వార్తలను ఆ దేశ మాజీ క్రికెటర్‌ ఏబీ...
13-07-2019
Jul 13, 2019, 12:05 IST
ఈ నేపథ్యంలో ధోని బీజేపీలో చేరితే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపుతారనే..
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top