ఇంగ్లండ్‌దే కేప్‌టౌన్‌ టెస్టు

England Beat South Africa In Cape Town Thriller To Level Series  - Sakshi

స్టోక్స్‌ అద్భుత బౌలింగ్‌

రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు తప్పని పరాజయం

కేప్‌టౌన్‌: ఈ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలవడం కష్టమే... కానీ ‘డ్రా’ చేసుకోవడం మాత్రం కష్టం కాదు. ఆఖరి సెషన్‌లో ఇంకా 13 ఓవర్లు మిగిలుండగా సఫారీ ఏడు వికెట్లను కోల్పోయింది. మిగతా మూడు వికెట్లతో 13 ఓవర్లు ‘డ్రా’మాలాడితే సరిపోయేది. కానీ ఇంగ్లండ్‌ పేసర్‌ బెన్‌ స్టోక్స్‌ (3/35) వారికి ఆ అవకాశమివ్వలేదు. ఇన్నింగ్స్‌ 134వ ఓవర్‌ వేసిన అతను వరుస బంతుల్లో ప్రిటోరియస్‌ (0), నోర్జే (0)లను డకౌట్‌ చేశాడు. దీంతో సఫారీ ‘డ్రా’ఆశలు కూలాయి.

ఫిలాండర్‌ (51 బంతుల్లో 8) రూపంలో ఆఖరి వికెట్‌ కూడా స్టోక్సే తీయడంతో... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 189 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం 126/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆటకొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 137.4 ఓవర్లలో 248 పరుగుల వద్ద ఆలౌటైంది. చివరి రోజు డికాక్‌ (50; 7 ఫోర్లు) మినహా ఇంకెవరూ ప్రతిఘటించలేకపోయారు. ఈ గెలుపుతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1–1తో ఇంగ్లండ్‌ సమం చేసింది. ఈ నెల 16 నుంచి పోర్ట్‌ ఎలిజబెత్‌లో మూడో టెస్టు జరుగుతుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top