ఇక ఆశలన్నీ కోహ్లీపైనే..! | england 64/4 in 12 overs | Sakshi
Sakshi News home page

ఇక ఆశలన్నీ కోహ్లీపైనే..!

Jan 15 2017 6:51 PM | Updated on Sep 5 2017 1:17 AM

ఇక ఆశలన్నీ కోహ్లీపైనే..!

ఇక ఆశలన్నీ కోహ్లీపైనే..!

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లోపడింది.

పుణె: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లోపడింది. 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్ (1), లోకేష్‌ రాహుల్‌ (8)వెంటవెంటనే అవుటవగా.. సీనియర్లు యువరాజ్‌ (15), ధోనీ (6) కూడా నిరాశపరిచారు. స్టోక్స్ బౌలింగ్‌లో యువీ, జేక్‌ బాల్‌ ఓవర్లో ధోనీ పెవిలియన్‌ చేరారు. దీంతో భారత్‌ 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. కోహ్లీ, జాదవ్‌  బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఓపెనర్లతో పాటు సీనియర్లు యువీ, ధోనీ అవుటవడంతో ఇక జట్టు భారమంతా కోహ్లీపైనే పడింది.

పుణెలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్‌ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది.  జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్‌ సెంచరీలతో రాణించగా, మోర్గాన్ (28), బట్లర్ (31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement