ఇషాకు 2 స్వర్ణాలు | Eesha Singh Bags Two Gold Medals In Asia Championship | Sakshi
Sakshi News home page

ఇషాకు 2 స్వర్ణాలు

Nov 8 2019 5:11 AM | Updated on Nov 8 2019 5:11 AM

Eesha Singh Bags Two Gold Medals In Asia Championship - Sakshi

దోహా: ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. జూనియర్‌ విభాగంలో ఇషా సింగ్, వివాన్‌ కపూర్‌లు చెరో రెండు పసిడి పతకాలతో చెలరేగారు. గురువారం జరిగిన జూనియర్‌ పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌లో 45 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచిన వివాన్‌ బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు.  42 పాయింట్లతో బోవ్‌నీశ్‌ మెన్దిరట్ట రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. జూనియర్‌ పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌ టీం విభాగంలో బరిలో దిగిన వివాన్, బోవ్‌నీశ్, మానవాదిత్య సింగ్‌లతో కూడిన భారత జట్టు తొలి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని గెలిచారు. జూనియర్‌ మహిళల 10మీ. ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో బరిలో దిగిన ఇషా సింగ్‌ 242.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రియా రాఘవ 217.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇక టీమ్‌ విభాగంలో బరిలో దిగిన ఈశా, ప్రియా, యువిక తోమర్‌ 1721 పాయింట్లతో ప్రపంచ జూనియర్‌ రికార్డు, ఆసియా రికార్డు నెలకొల్పి పసిడి పతకాన్ని భారత్‌ ఖాతాలో వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement