బ్రేవో వచ్చేస్తున్నాడు

Dwayne Bravo Is Back In International T20 Cricket - Sakshi

రిటైర్మెంట్‌పై మనసు మార్చుకున్న విండీస్‌ ఆల్‌రౌండర్‌

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో మళ్లీ అంతర్జాతీయ టి20 క్రికెట్‌లోకి వచ్చేస్తున్నాడు. నిరుడు అక్టోబర్‌లో వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు (సీడబ్ల్యూఐ) మాజీ అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌తో గొడవల కారణంగా... అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన బ్రేవో తిరిగి తన దేశానికి ఆడాలని ఉందంటూ మనసులోని మాటను బయట పెట్టాడు. దీనికి కారణం వివాదాస్పద అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న డేవ్‌ కామెరూన్‌ స్థానంలో మాజీ విండీస్‌ జట్టు మేనేజర్‌ రికీ స్కెరిట్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టడమే అని అతడు పేర్కొన్నాడు.

అయితే తన పునరాగమనం టి20లకి మాత్రమే పరిమితమని బ్రేవో తెలిపాడు. ప్రస్తుతం ఉన్న జట్టులో ప్రతిభకు కొదవలేదని, కొత్త కోచ్‌ ఫిల్‌ సిమన్స్, పొలార్డ్‌ సారథ్యంలోని జట్టు అద్భుతంగా ఆడుతుందంటూ కితాబిచ్చాడు. బ్రేవో విండీస్‌ తరఫున చివరి టి20ని మూడేళ్ల క్రితం సెపె్టంబర్‌లో ఆడాడు. బ్రేవో విండీస్‌ తరఫున మొత్తం 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 6310 పరుగులు చేసిన అతను 337 వికెట్లు కూడా తీశాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top