ద్విశతక వీరుడు

Double Century In Under 19 Cricket Inter State level - Sakshi

అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ పోటీల్లో సిక్కోలు సూర్యకిరణం

ధర్మశాలలో సూర్యకిరణ్‌ డబుల్‌ సెంచరీ   

శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు యువ సంచలనం మద్దెల సూర్యకిరణ్‌ క్రికెట్‌లో జిల్లా పేరు నిలబెడుతున్నాడు. ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్న కిరణ్‌ (జిల్లా నుంచి మొదటి వ్యక్తి) అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ టోర్నీలో డబుల్‌ సెంచరీ చేసి సత్తా చాటాడు. విజయ్‌ మర్చెంట్‌ అంతర్‌ రాష్ట్ర అండర్‌–16 క్రికెట్‌ పోటీల్లో పాల్గొనేందుకు ముందు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న అంతర్‌ రాష్ట్రాల ట్ర యాంగ్లర్‌ సిరీస్‌(ఇండివిడ్యువల్‌ మ్యాచ్‌లు)లో డబుల్‌ సెంచరీతో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

ఈ నెల 5 నుంచి హిమాచల్‌ప్రదేశ్‌–1 జట్టుతో జరిగిన మూడు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌లో వన్‌ డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన కిరణ్‌ 376 బంతులను ఎదుర్కొని 229 పరుగులు చేశాడు. ఇందులో 37 బౌండరీలు, ఒక భారీ సిక్సర్‌ ఉండటం విశేషం. జిల్లా నుంచి ఇంతవరకు ఎవరూ ఈ స్థాయిలో క్రికెట్‌లో రాణించలేదు. ఈ మ్యాచ్‌లోనే కాదు హిమాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు, పశ్చిమబెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో డబుల్‌సెంచరీతో హోరెత్తించి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అం దుకున్నాడు. సూర్యకిరణ్‌ సత్తా చాటడంపై జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. జిల్లాకు గర్వకారణంగా నిలిచిన సూర్యకిరణ్‌ను శ్రీకాకుళం జిల్లా బాలురు బాలికల క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర ఎన్‌వీ నాయుడు, జేవీ భాస్కరరావు, ఉపాధ్యాక్షులు బోయిన రమేష్, పి.సూర్యారావు, కోశాధికారి గిరిధరరావు, కార్యవర్గ సభ్యులు, కోచ్‌లు అభినందించారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సూర్యకిరణ్‌ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగాడు. తల్లిదండ్రులు మద్దెల వరప్రసాద్, విజయలక్ష్మి, చెల్లి (మైథిలి). తండ్రి సివి ల్‌ కానిస్టేబుల్‌. తల్లి గృహిణి. వరప్రసాద్‌ రేగిడి ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి స్వస్థలం ఎచ్చెర్ల మండలంలోని షేర్‌మహ్మద్‌ పురం గ్రామం. అయితే ప్రస్తుతం వరప్రసాద్‌ ఉద్యోగ రీత్యా పాలకొండలో నివా సం ఉంటున్నారు. సూర్యకిరణ్‌ ప్రస్తుతం విజ యనగరంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ (సీఈఓ గ్రూప్‌) చదువుతున్నాడు.

బ్యాటింగే ప్రధాన బలం
2012లో శిక్షణ ఆరంభించిన సూర్యకిరణ్‌కు బ్యా టింగే బలం. ఏ స్థానంలో అయినా కుదురుకుని మంచి టెక్నిక్‌తో బ్యాటింగ్‌ చేయడం ఈ రైట్‌ హ్యాండర్‌ ప్రత్యేకత. 2013లో జిల్లా అండర్‌–14 జట్టుకు ఎంపికయ్యాడు. అది మొదలు వెనుదిరి గి చూడలేదు. 2014, 2015ల్లో అండర్‌–14 ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016, 17లో అండర్‌–16 జట్లకు ఎంపికై సత్తాచాటాడు. అంతర్‌రాష్ట్ర పోటీల్లో పాల్గొన్న మొద టి మ్యాచ్‌లోనే 65 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అక్కడి నుంచి అవకాశం దొరికిన ప్రతి చోటా పరుగులు సాధిస్తూ సెలెక్టర్లను మెప్పిస్తున్నాడు. స్పిన్‌ బౌలర్‌గానూ జట్టుకు సేవలందించగలడు. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా అంచెలంచెలుగా రాణిన్నాడు.  

జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యం
నన్ను నిరంతరం మా పేరెంట్స్, కోచ్‌లు, క్రికెట్‌ సంఘ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాను. డబుల్‌ సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని భారీ స్కోర్లు చేస్తానన్న నమ్మకం కలిగింది. రంజీ జట్టుకు ఎంపికై, అక్కడ రాణించి తర్వాత జాతీయ జట్టుకే ఎంపికే లక్ష్యంగా ఆడతాను. జిల్లాకు, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొస్తాను.
– మద్దెల సూర్యకిరణ్, ఆంధ్రా జట్టు కెప్టెన్, అండర్‌–16

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top