దినేశ్‌ కార్తీక్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

Dinesh Karthik Makes His World Cup Debut Against Bangladesh - Sakshi

బర్మింగ్‌హామ్‌ : ప్రపంచకప్‌ ఆడాలనేది ప్రతీ ఒక్క క్రికెటర్‌ కల. అయితే క్రికెట్‌ విశ్వసమరంలో ఆడే అవకాశం కొందరికి కెరీర్‌ ఆరంభంలోనే దొరికితే.. మరికొందరికి ఏళ్ల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఏకంగా 15 ఏళ్ల పాటు నిరీక్షణ అనంతరం టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌కు ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశాడు. మంగళవారం ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో కార్తీక్‌ ప్రపంచకప్‌లో ఆడే అవకాశం వచ్చింది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అంతగా ఆకట్టుకోని కేదార్‌ జాదవ్‌ స్థానంలో కార్తీక్‌ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో కార్తీక్‌ అంతగా ఆకట్టుకోలేదు. కేవలం ఎనిమిది పరుగులే సాధించి ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగి నిరుత్సాహపరిచాడు.      

2004లోనే కా​ర్తీక్‌ టీమిండియా జెర్సీ ధరించాడు. నిలకడలేమి ఆటతో పలుమార్లు జట్టుకు దూరమయ్యాడు. అయితే అప్పటిపరిస్థితుల్లో మరో స్ట్రాంగ్‌ వికెట్‌ కీపర్‌ లేకపోవడంతో కార్తీక్‌కు సెలక్టర్లు పదేపదే అవకాశాలు ఇచ్చారు. అనంతరం ఎంఎస్‌ ధోని జట్టులో సుస్థిరం స్థానం ఏర్పరుచుకోవడంతో కార్తీక్‌ను పూర్తిగా పక్కకు పెట్టేశారు. అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నా అంతగా ఆకట్టుకోలేదు. అయితే నిదహాస్‌ ట్రోఫీలో రాణించడంతో కార్తీక్‌ను ధోనితో పాటు జట్టులో కొనసాగిస్తున్నారు. ఇక వెస్టిండీస్‌ వేదికగా జరిగిన 2007 ప్రపంచకప్‌లో టీమిండియా తరుపున కార్తీక్‌ పాల్గొన్నప్పటికీ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. (చదవండి: ‘తొలి అడుగు టీమిండియా సిరీస్‌తోనే’)

చదవండి:
షమీ మతాన్ని ప్రస్తావించిన రజాక్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top