బంతి అడిగింది బైబై చెప్పేందుక్కాదు... 

Dhoni took the ball to show it to bowling coach: Shastri - Sakshi

ధోని రిటైర్మెంట్‌ వార్తలను తోసిపుచ్చిన కోచ్‌  

లండన్‌: భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని త్వరలో రిటైర్‌ కానున్నాడనే వార్తల్ని హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి తోసి పుచ్చారు. లీడ్స్‌లో మూడో వన్డే ముగిశాక ధోని ఫీల్డు అంపైర్ల నుంచి బంతిని తీసుకెళ్లాడు. ఇది ధోని రిటైర్మెంట్‌కు సంకేతమని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వెలువెత్తాయి. దీన్ని గురువారం హెడ్‌ కోచ్‌ ఖండించారు. ధోని బంతిని తీసుకెళ్లింది భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించేందుకేనని ఆయన స్పష్టం చేశారు. ‘అవన్నీ అర్థంలేని వార్తలు. ధోని రిటైర్‌ కావట్లేదు.

బంతి స్థితిగతుల్ని తెలిపేందుకే ధోని దాన్ని తీసుకెళ్లాడు. 45 ఓవర్లు వేసేసరికి బంతి ఎంతలా పాడైపోతుందో బౌలింగ్‌ కోచ్‌కు స్పష్టంగా చూపేందుకే ఆ మ్యాచ్‌ ఆడిన బంతిని అంపైర్లను అడిగి ధోని వెంటతీసుకెళ్లాడు. అంతే తప్ప రిటైర్మెంట్‌ ప్రకటించేందుకు కానే కాదు’ అని రవిశాస్త్రి తెలిపారు. ఇలాంటి ఊహాగానాలు, ఆధారం లేని వార్తలు ఎక్కడినుంచి మొదలవుతాయో తెలియదని అన్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top