టీమిండియాకు స్పాన్సర్ల కరువు | despite slashing base price no takers for logo rights of indian cricket team | Sakshi
Sakshi News home page

టీమిండియాకు స్పాన్సర్ల కరువు

Nov 29 2013 5:59 PM | Updated on Sep 2 2017 1:06 AM

వన్డేల్లో వల్డ్‌ నంబర్‌ వన్‌ టీమ్‌ ఇండియా, టెస్టుల్లో నంబర్‌ టూ, టి- ట్వంటీల్లో నంబర్‌ టూ.. వీటికి తోడు క్రికెట్‌ ప్రపంచంలోఅత్యంత ధనిక బోర్డు బీసీసీఐ.

ముంబై: వన్డేల్లో ప్రపంచ నంబర్‌ వన్‌ టీమ్‌ ఇండియా, టెస్టుల్లో నంబర్‌ టూ, ట్వంటీ-20ల్లో నంబర్‌ టూ.. వీటికి తోడు క్రికెట్‌ ప్రపంచంలోఅత్యంత ధనిక బోర్డు బీసీసీఐ. అయినా కూడా టీమిండియాకే స్పాన్సర్లు కరువయ్యారు. అవును, ఇది నిజం. వచ్చే జనవరి నుండి 2017 మార్చి 31 వరకు 19 టెస్టులు, 25 వన్డేలు, 5 టి- ట్వంటీ మ్యాచ్‌లు టీమిండియా ఆడుతుందని హామీ ఇస్తూ, ప్లేయర్ల బ్లూ జెర్సీలపై లోగోలను  బీసీసీఐ స్పాన్సర్లకు ఆఫర్‌ చేస్తోంది. అంతకముందు మూడేళ్లుగా భారత ఆటగాళ్లకు సహారా చెల్లించింది మాత్రం  రూ. 448-548  కోట్లు మధ్య. ఇప్పటి వరకు అఫీషియల్‌ స్పాన్సర్‌ సహారా ప్రతి టీమిండియా మ్యాచ్‌కు 3.34 కోట్ల రూపాయలను ఇచ్చింది.

 

నిజానికి 2010లో నిర్దారించిన బేస్‌ ప్రైజ్‌ 2.5 కోట్లు మాత్రమే, దానికి తోడు సచిన్‌ లాంటి స్టార్లు ఆడకున్నా సరే పూర్తి మొత్తాన్ని వసూలు చేశారని సహారా ఆరోపించింది.  ఈ నేపథ్యంలో బీసీసీఐ మాత్రం బేస్‌ ప్రైజ్‌ను 1.5 కోట్లకు తగ్గించినా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో క్రికెట్‌ పెద్దలకు మింగుడు పడని అంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement