రైనా టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ | Delhi Daredevils won the toss and elected to field | Sakshi
Sakshi News home page

రైనా టీమ్ ఫస్ట్ బ్యాటింగ్

Apr 27 2016 7:57 PM | Updated on Aug 21 2018 2:28 PM

ఐపీఎల్-9లో భాగంగా బుధవారం ఇక్కడ జరుగుతున్న 23 లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్ టీమ్స్ తలపడుతున్నాయి.

న్యూఢిల్లీ: ఐపీఎల్-9లో భాగంగా బుధవారం ఇక్కడ జరుగుతున్న 23 లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, గుజరాత్ లయన్స్ టీమ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయపడిన ఆరోన్‌ ఫించ్, జకాతి స్థానంలో ఫాల్కనర్, ఇషాన్ కిషాన్ టీమ్ లోకి వచ్చారు. ఢిల్లీ టీమ్ లోనూ రెండు మార్పులు జరిగాయి. మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్ స్థానంలో నదీమ్, రిషబ్ పంత్ ను తీసుకున్నారు.

పాయింట్ల పట్టికలో గుజరాత్, ఢిల్లీ రెండు-మూడు స్థానాల్లో ఉన్నాయి. సురేశ్ రైనా నాయకత్వంలోని గుజరాత్ టీమ్ ఇప్పటివరకు 5 మ్యాచులు ఆడి నాలుగింటిలో నెగ్గి, ఒకటి ఓడింది. ఢిల్లీ నాలుగు మ్యాచుల్లో మూడింటిలో గెలిచి, ఒకటి చేజార్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement