గట్టెక్కిన వావ్రింకా | Defending champions | Sakshi
Sakshi News home page

గట్టెక్కిన వావ్రింకా

May 24 2016 12:33 AM | Updated on Sep 4 2017 12:46 AM

గట్టెక్కిన వావ్రింకా

గట్టెక్కిన వావ్రింకా

కాస్త అటు ఇటు అయి ఉంటే... మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించిన మొదటి డిఫెండింగ్ ....

ఐదు సెట్‌ల పోరులో నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రెంచ్ ఓపెన్
 
పారిస్: కాస్త అటు ఇటు అయి ఉంటే... మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించిన మొదటి డిఫెండింగ్ చాంపియన్ క్రీడాకారుడిగా అపప్రథను మూటగట్టుకునేవాడు. అయితే తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో వావ్రింకా 4-6, 6-1, 3-6, 6-3, 6-4తో లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్)పై కష్టపడి గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో 46 అనవసర తప్పిదాలు చేసిన వావ్రింకా తన సర్వీస్‌లో ఎనిమిదిసార్లు బ్రేక్ పాయింట్ల ను కాపాడుకున్నాడు.

ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-1, 7-5, 6-3తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 6-3, 6-2, 7-6 (7/5)తో టిప్సరెవిచ్ (సెర్బియా)పై, 22వ సీడ్ విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) 2-6, 6-3, 5-7, 7-5, 6-3తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించారు. 23వ సీడ్ జాక్ సోక్ (అమెరికా), 27వ సీడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా), 30వ సీడ్ జెరెమి చార్డీ (ఫ్రాన్స్) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.


ఏడో సీడ్ విన్సీ ఓటమి
మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్) 6-1, 6-3తో విన్సీపై సంచలన విజయం సాధించింది. మరోవైపు నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) మూడు సెట్‌ల పోరులో గట్టెక్కగా... 16వ సీడ్ సారా ఎరాని (ఇటలీ), 17వ సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. ముగురుజా 3-6, 6-3, 6-3తో షిమిడ్లోవా (స్లొవేకియా)పై గెలుపొందగా... సారా ఎరాని 3-6, 2-6తో పిరొన్‌కోవా (బల్గేరియా) చేతిలో, ప్లిస్కోవా 6-3, 4-6, 3-6తో షెల్బీ రోజర్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-0, 6-2తో జొవనోవ్‌స్కీ (సెర్బియా)పై  విజయం సాధించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement