డేవిడ్‌ వార్నర్‌ కొత్త అవతారం  | David Warner to join Channel Nine cricket commentary team | Sakshi
Sakshi News home page

డేవిడ్‌ వార్నర్‌ కొత్త అవతారం 

Jun 11 2018 1:54 AM | Updated on Jun 11 2018 1:54 AM

David Warner to join Channel Nine cricket commentary team - Sakshi

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తనున్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను ఈ నెల 13 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

‘దశాబ్ద కాలంగా టి20, వన్డేల్లో వార్నర్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఇప్పుడు అతను మాతో కలవనున్నాడు’ అని ఈ సిరీస్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న చానెల్‌–9 డైరెక్టర్‌ టామ్‌ మలాన్‌ తెలిపారు.  జూన్‌ 16న కార్డిఫ్‌లో జరిగే రెండో మ్యాచ్‌లో వార్నర్‌ కామెంటేటర్‌గా కనిపించనున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement