వాట్సన్‌ వీరంగం.. ధోని దూకుడు | CSK set target of 212 runs against Delhi | Sakshi
Sakshi News home page

వాట్సన్‌ వీరంగం.. ధోని దూకుడు

Published Mon, Apr 30 2018 9:47 PM | Last Updated on Mon, Apr 30 2018 10:05 PM

CSK set target of 212 runs against Delhi - Sakshi

పుణె: ఈ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)సీజన్‌లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై వీరంగం సృష్టించాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఇన్నింగ్స్‌ను షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌లు ఆరంభించారు. ఒక ఎండ్‌లో డుప్లెసిస్‌ నిలకడగా ఆడితే, మరో ఎండ్‌లో వాట్సన్‌ మాత్రం విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. 40 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు సాధించి చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.  

ఆది నుంచి చెలరేగి ఆడిన వాట్సన్‌.. 25 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డు ప్లెసిస్‌(33)తో కలిసి తొలి వికెట్‌కు 102 పరుగులు జత చేశాడు. కాగా, పరుగు వ్యవధిలో చెన్నై రైనా(1) వికెట్‌ను కోల్పోవడంతో వాట్సన్‌ కాసేపు నెమ్మదించాడు. ఆ తర్వాత అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్మించిన వాట్సన్‌ మరోసారి బ్యాట్‌కు పనిచెప్పాడు. ప్రధానంగా సొగసైన గ్యాప్‌ షాట్లతో వాట్సన్‌ అలరించాడు. అయితే అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన వాట్సన్‌ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో మరోసారి సెంచరీ చేస్తాడనుకున్న చెన్నై అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే వాట్సన్‌ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోని దూకుడును కొనసాగించాడు. తనదైన స్టైల్‌లో ఢిల్లీ బౌలర్లలోపై విరుచుకుపడిన  22 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో ధోని (51 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీ సాధించాడు. మరొకవైపు రాయుడు(41‌; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా సమయోచితంగా ఆడటంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement