ఆడటం నీ డ్యూటీ.. మాట్లాడటం నా డ్యూటీ!

Cricket In Empty Stadiums Not New For Us, Dinesh Karthik - Sakshi

ఇయాన్‌ చాపెల్‌ను గుర్తుచేసుకున్న దినేశ్‌

కామెంటేటర్‌గా ఆయన చెప్పింది నిజం..

వ్యాఖ్యాతలు  చెప్పేది మనకోసమే..

ప్రేక్షకులు లేకుండా ఈవెంట్స్‌కు నేను సిద్ధం

ఇదేమి మనకు కొత్త కాదు కదా..

చెన్నై: ప్రస్తుతం క్రీడా ప్రపంచం చాలా విషయాలపై డివైడ్‌ అయిపోయినట్లే కనబడుతోంది. కరోనా వైరస్‌ కారణంగా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు ఆడలేమని కొంతమంది అంటుంటే,  అంతే స్థాయిలో ప్రేక్షకులు లేకుండా ఆడటంలో తప్పేమిటనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహణకు టీమిండియా వికెట్‌ కీపర్‌, కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ మద్దతుగా నిలిచాడు. ఇందుకు దేశీయ మ్యాచ్‌లనే ఉదాహరణగా తీసుకోవాలన్నాడు. ‘ మనం దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు క్రికెట్‌ స్టేడియాల్లో అభిమానులు పెద్దగా కనిపించరు. మనం ప్రేక్షకులు లేకుండానే క్రికెట్‌ ఆడుతూ పెరిగాం. ఇదేమీ మనకు కొత్తమే కాదు. ఇప్పుడేదో ప్రేక్షకులు లేకుండా కొత్తగా మ్యాచ్‌లు ఆడుతున్నట్లు చెబుతారెందుకు’ అని ప్రశ్నించాడు. ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు మాజీ మీడియం పేసర్‌, కామెంటేటర్‌ ఇసా గుహాతో ఇన్‌స్టా చాట్‌లో ఈ విషయంపై ముచ్చటించారు. (‘ఐపీఎల్‌ కోసం షెడ్యూల్‌ మార్చితే సహించం’)

ఇక వ్యాఖ్యాతల వ్యహరిస్తున్న తీరుతో  చాలామంది బాధపడుతూ ఉంటారని కార్తీక్‌ పేర్కొన్నాడు. అయితే ఇక్కడ కామెంటేటర్‌లను కార్తీక్‌ సమర్ధించాడు. వారు మన గురించి మాట్లాడకపోతే నువ్వు ఏంటనేది ఎలా తెలుస్తుందన్నాడు. కామెంటేటర్‌లు కేవలం నీ ఆట గురించి మాత్రమే మాట్లాడతారనే విషయం తెలుసుకోవాలన్నాడు. దీనిలో భాగంగా ఒకానొక సందర్భంలో ప్రముఖ వ్యాఖ్యత ఇయాన్‌ చాపెల్‌ ఇంటర్యూను కార్తీక్‌ ప్రస్తావించాడు. ‘‘ ఒక ప్లేయర్‌ నా దగ్గరకొచ్చి ఎందుకు మాట్లాడతున్నారని అడిగాడు.. అప్పుడు చాపెల్‌ సమాధానం ఒక్కటే. ఆడటం నీ డ్యూటీ.. మాట్లాడటం నా డ్యూటీ’’ అని బదులిచ్చాడని కార్తీక్‌ గుర్తుచేసుకున్నాడు. అది నిజమేనని కార్తీక్‌ పేర్కొన్నాడు. కామెంటేటర్‌లు మన కోసమే చెబుతారనేది గ్రహించాలన్నాడు. (ధోనికి చాన్స్‌ ఇవ్వడం బాధించింది)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top