15 ఏళ్ల 7 నెలలకే...

Coco Gauff Becomes Youngest Tennis Titlist In 15 Years - Sakshi

లింజ్‌ (ఆస్ట్రియా): అమెరికా టీనేజ్‌ సంచలనం కోకో గౌఫ్‌ తన కెరీర్‌లో తొలి మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్‌ టైటిల్‌ను సాధించింది. ఆదివారం జరిగిన లింజ్‌ ఓపెన్‌ టోర్నీ ఫైనల్లో 15 ఏళ్ల 7 నెలల కోకో గౌఫ్‌ 6–3, 1–6, 6–3తో 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఒస్టాపెంకో (లాత్వియా)పై నెగ్గి... 34,677 యూరోల (రూ. 27 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీని  దక్కించుకుంది. 2004లో వైదిసోవా (చెక్‌ రిపబ్లిక్‌–15 ఏళ్ల 3 నెలల 23 రోజులు; వాంకోవర్‌ ఓపెన్‌) తర్వాత పిన్న వయస్సులో డబ్ల్యూటీఏ టైటిల్‌ నెగ్గిన ప్లేయర్‌గా కోరి గుర్తింపు పొందింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top