
గోల్డ్‌కోస్ట్: ఘనంగా ప్రారంభమై సజావుగా సాగిన ప్రతిష్ఠాత్మక 21వ కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకలు మాత్రం ఆ స్థాయిలో జరగలేదు. ప్రసారకర్తలు కనీసం అథ్లెట్ల మార్చ్‌పాస్ట్‌ను కూడా పూర్తి స్థాయిలో చూపించలేకపోయారు. సుదీర్ఘ ప్రసంగాల కవరేజీపైనే ఎక్కువ దృష్టిపెట్టడంతో విసుగెత్తిన ప్రేక్షకులు ముందుగానే వెళ్లిపోయారు.
దీనిపై విమర్శలు రావడంతో క్రీడల చీఫ్ పీటర్ బీటీ సోమవారం క్షమాపణ చెప్పారు. అథ్లెట్లను కార్యక్రమంలో భాగం చేయాలనుకుని ముందుగానే స్టేడియంలోకి తీసుకురావడంతో వారి మార్చ్‌పాస్ట్‌ను చూసే అవకాశం టీవీ ప్రేక్షకులను దక్కలేదు. దీంతో అంతా తారుమారై కార్యక్రమ ప్రాధాన్యత మారిపోయింది.