12, 13 తేదీల్లో చెస్‌ టోర్నీ | chess tourney on 12th and 13th | Sakshi
Sakshi News home page

12, 13 తేదీల్లో చెస్‌ టోర్నీ

Aug 11 2017 10:42 AM | Updated on Sep 11 2017 11:50 PM

బ్రిలియంట్‌ ట్రోఫీ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఈనెల 12, 13 తేదీల్లో జరగనుంది.

సాక్షి, హైదరాబాద్‌: బ్రిలియంట్‌ ట్రోఫీ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఈనెల 12, 13 తేదీల్లో జరగనుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. అండర్‌–6, 8, 10, 12, 14 బాలబాలికల విభాగాల్లో వేరువేరుగా పోటీలను నిర్వహిస్తారు.

 

ఈ టోర్నీలో రాణించిన 20మంది క్రీడాకారులకు బహుమతులను అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 12వ తేదీ మధ్యాహ్నం గం. 1లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం జె. సుబ్రహ్మణ్యం (92473 99717)ను సంప్రదించాలి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement