breaking news
brilliant trophy open chess tournament
-
12, 13 తేదీల్లో చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఈనెల 12, 13 తేదీల్లో జరగనుంది. దిల్సుఖ్నగర్లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. అండర్–6, 8, 10, 12, 14 బాలబాలికల విభాగాల్లో వేరువేరుగా పోటీలను నిర్వహిస్తారు. ఈ టోర్నీలో రాణించిన 20మంది క్రీడాకారులకు బహుమతులను అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 12వ తేదీ మధ్యాహ్నం గం. 1లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం జె. సుబ్రహ్మణ్యం (92473 99717)ను సంప్రదించాలి. -
అగ్రస్థానంలో ఓజస్, అర్జున్
బ్రిలియంట్ చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ట్రోఫీ చెస్ టోర్నమెంట్లో మూడో రౌండ్ ముగిసే సరికి జూనియర్ కేటగిరీలో ఓజస్, అర్జున్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. వీరిద్దరితో పా టు అద్వైత్ శర్మ, ఉమేశ్, సిద్ధార్థ్ కూడా అగ్రస్థానంలో ఉన్నారు. దిల్సుఖ్నగర్లోని బ్రిలి యంట్ స్కూల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం ఓజస్ (3) ... విఘ్నేశ్ (2)పై, అర్జు న్ (3)... శ్రీనందన్ (2)పై గెలుపొందారు. ఇతర మ్యాచ్ల్లో హిమసూర్య (2)... ఉమేశ్ (3) చేతిలో ఓడిపోగా, సిద్ధార్థ్ (3)... కమల్ (2)పై, అద్వైత్ శర్మ (3)... సౌరిశ్ రావు (2)పై విజయం సాధించారు. ఓపెన్ కేటగిరీ మూడో రౌండ్ ఫలితాలు రాజు (3... స్పందన్ (2)పై, ఖాన్ (3)... శ్రీక ర్ (2)పై, ప్రణీత్ (2.5)... కశ్యప్ (1.5)పై, అనిల్ కుమార్ (2.5)... శరత్ చంద్ర (1.5)పై గెలుపొందారు. నిఖిల్ (2.5)... సుబ్బరాజు (2.5), విశ్వంత్ (2.5)... ఆశిష్ రెడ్డి (2.5)ల మధ్య మ్యాచ్లు డ్రా అయ్యాయి.