‘ఎఫ్‌ 1’ కూడా వేరొకరి చేతుల్లోకి... | British energy drinks company looks to buy Vijay Mallya's Force | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌ 1’ కూడా వేరొకరి చేతుల్లోకి...

Feb 23 2018 12:33 AM | Updated on Feb 23 2018 12:33 AM

British energy drinks company looks to buy Vijay Mallya's Force - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకుండా దేశం వదిలి పరారైన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు చెందిన ‘ఫోర్స్‌ ఇండియా’ ఎఫ్‌1 జట్టు త్వరలోనే వేరొకరి హస్తగతం కానుంది. ఫోర్స్‌ ఇండియాను బ్రిటన్‌కు చెందిన ఓ శీతల పానీయాల తయారీ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు రూ.1,806 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. ‘రిచ్‌ ఎనర్జీ’ అనే బ్రిటిష్‌ శీతల పానీయాల సంస్థ దాదాపు 200 మిలియన్ల డాలర్లకు ఫోర్స్‌ ఇండియాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. గతంలో ఐపీఎల్‌ టీమ్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరులో ఉన్న వాటాను కూడా  తొలగించడంతో ఆ జట్టుతో ప్రస్తుతం ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement