
మా కుక్కపిల్ల బోల్ట్‌లా పరుగెడుతుంది!
క్రికెట్ ప్రపంచంలోని వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా బ్రెట్ లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ఫాస్ట్ బౌలర్‌ను కూడా ఒక చిన్నజీవి పరుగులు పెట్టిస్తుంది. అదెవరో కాదు...
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలోని వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా బ్రెట్ లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ఫాస్ట్ బౌలర్‌ను కూడా ఒక చిన్నజీవి పరుగులు పెట్టిస్తుంది. అదెవరో కాదు...లీ ముద్దుగా పెంచుకుంటున్న కుక్క పిల్ల! ఇంకా చెప్పాలంటే ‘గింగర్’ అనే పేరు గల ఆ కుక్క పిల్ల ప్రపంచ చాంపియన్ ఉసేన్ బోల్ట్‌తో సమానంగా పరుగెత్తుతుందని కూడా బ్రెట్‌లీ చెబుతున్నాడు.
శునకాహారం ‘పెడిగ్రీ సీనియర్’ను మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా లీ ఈ వ్యాఖ్య చేశాడు. ‘ఆ పప్పీ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. ఆరు నెలల కుక్క పిల్ల మీ ఇల్లంతా పరుగెడుతుంటే ఉంటే సందడే వేరు. ఇది ఉసేన్ బోల్ట్ అంత వేగంగా పరుగెత్తుతోంది. నా వద్ద కుందేళ్లు, గినియా పందులు, అనేక రకాల పక్షులు కూడా చాలా ఉన్నాయి’ అని లీ వెల్లడించాడు.