రాణించిన భారత ‘ఎ’ బౌలర్లు | Bowlers help India A take two-run lead over Australia A | Sakshi
Sakshi News home page

రాణించిన భారత ‘ఎ’ బౌలర్లు

Sep 10 2016 1:00 AM | Updated on Sep 4 2017 12:49 PM

రాణించిన భారత ‘ఎ’ బౌలర్లు

రాణించిన భారత ‘ఎ’ బౌలర్లు

ఆస్ట్రేలియా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో బ్యాటింగ్‌లో తడబడిన భారత ‘ఎ’ జట్టును బౌలర్లు ఆదుకున్నారు.

ఆస్ట్రేలియా ‘ఎ’ 228 ఆలౌట్   
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో తొలి అనధికారిక టెస్టులో బ్యాటింగ్‌లో తడబడిన భారత ‘ఎ’ జట్టును బౌలర్లు ఆదుకున్నారు. వరుణ్ ఆరోన్ (3/41), జయంత్ యాదవ్ (3/44) రాణించడంతో రెండో రోజు శుక్రవారం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 228 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 2 పరుగుల తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం దక్కింది. కెప్టెన్ హ్యాండ్‌‌సకోంబ్ (93 బంతుల్లో 87; 15 ఫోర్లు, 1 సిక్స్), బర్న్స్ (125 బంతుల్లో 78; 11 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. హ్యాండ్‌‌సకోంబ్, బర్నస్ మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్‌‌స ఆరంభించిన భారత జట్టు హేర్వాడ్కర్ (23), ఫజల్ (6) వికెట్లను కోల్పోరుు 44 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి పాండే (7), శ్రేయస్ (6) క్రీజులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement