ఆనంద్ ఓడినా... | Bilbao Chess: Viswanathan Anand beats Ruslan Ponomariov in first round | Sakshi
Sakshi News home page

ఆనంద్ ఓడినా...

Sep 21 2014 1:41 AM | Updated on Sep 2 2017 1:41 PM

ఆనంద్ ఓడినా...

ఆనంద్ ఓడినా...

మరో రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ ఖాయం కావడంతో... చివరి రౌండ్‌ను తేలిగ్గా తీసుకున్నాడో ఏమోగానీ బిల్బావో మాస్టర్స్ ఫైనల్ చెస్ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమితో ముగించాడు.

బిల్బావో (స్పెయిన్): మరో రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ ఖాయం కావడంతో... చివరి రౌండ్‌ను తేలిగ్గా తీసుకున్నాడో ఏమోగానీ బిల్బావో మాస్టర్స్ ఫైనల్ చెస్ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓటమితో ముగించాడు. గత ఏడాది విజేత లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా)తో శనివారం జరిగిన చివరిదైన ఆరో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 46 ఎత్తుల్లో ఓడిపోయాడు. నలుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ 11 పాయింట్లతో విజేతగా నిలువగా... అరోనియన్ 10 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. పొనమరియోవ్ (ఉక్రెయిన్), ఫ్రాన్సిస్కో వలెజో ఐదేసి పాయింట్లతో ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement