క్రికెటర్ షమీ మెడకు మరో ఉచ్చు!

BCCIs ACSU will Investigate Mohammed Shami For Corruption - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ వివాహేతర సంబంధాల కేసు వివాదం అతడి కెరీర్‌ను భారీ దెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. వివాహేతర సంబంధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షమీ మెడకు అవినీతి, ఫిక్సింగ్ కేసు చుట్టుకుంది. భార్య చేసిన ఆరోపణల్ని విశ్వసించిన బీసీసీఐ బౌలర్ షమీపై విచారణ చేపట్టాలని అవినీతి నిరోధక-భద్రతా విభాగాన్ని  (యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్‌)ఆదేశించింది.

తన భర్త షమీ దుబాయ్ వెళ్లి అక్కడ కొందరు వ్యక్తుల నుంచి డబ్బు తీసుకున్నాడని హసీన్‌ జహాన్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌కు చెందిన మహ్మద్ బాయ్ అనే మధ్యవర్తి ద్వారా పాకిస్తాన్ మహిళ నుంచి తన భర్త షమీ డబ్బులు తీసుకున్నాడని హసీన్ జహాన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఏసీఎస్‌యూ అధిపతి నీరజ్ కపూర్‌ షమీ కేసును విచారించి వారం రోజుల్లోగా నివేదిక అందించనున్నట్లు సమాచారం. 

మరోవైపు భార్యతో క్రికెటర్ షమీ ఫోన్ సంభాషణను సీఓఏ విన్న తర్వాత షమీపై విచారణ చేపట్టాలని నిర్ణయించుకుంది. పాక్ మహిళ నుంచి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం డబ్బులు తీసుకున్నాడా.. లేక ఇతరత్రా విషయాల కోసమా అన్నది తమ విచారణలో తేలనుందని బీసీసీఐ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ వింగ్ పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top