బీసీసీఐ చెల్లించిన పన్ను రూ. 2,140 కోట్లు | BCCI paid tax of Rs. 2,140 crore | Sakshi
Sakshi News home page

బీసీసీఐ చెల్లించిన పన్ను రూ. 2,140 కోట్లు

May 13 2015 1:24 AM | Updated on Sep 27 2018 4:47 PM

భారత క్రికెట్ బోర్డు నుంచి రావాల్సిన పన్ను బకాయిల్లో రూ.2,140.48 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది.

న్యూఢిల్లీ : భారత క్రికెట్ బోర్డు నుంచి రావాల్సిన పన్ను బకాయిల్లో రూ.2,140.48 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది. మిగతా రూ.369.89 కోట్లు ఐటీ అధికారుల దగ్గర నిలిచిపోయాయని, బీసీసీఐ చేసుకున్న అప్పీల్‌ను తిరస్కరించే వరకు అక్కడే ఉంటాయని రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రావాల్సిన బకాయిల్లో 2008-09లో రూ.50 కోట్లు, 2010-11లో రూ.100 కోట్లు, 2011-12లో రూ.100 కోట్లు, 2012-13లో రూ.116.89 కోట్లు ఉన్నాయని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement