బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగించింది. డేల్ స్టెయిన్ (3/30)కు తోడు డుమిని (3/27)
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 246/8
ఢాకా: బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగించింది. డేల్ స్టెయిన్ (3/30)కు తోడు డుమిని (3/27) స్పిన్ మ్యాజిక్‌తో ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. ఫలితంగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 8 వికెట్లకు 246 పరుగులు చేసింది. ఆట ముగిసే సమయానికి నాసిర్ హుస్సేన్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. షేర్ ఎ బంగ్లా జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఓపెనర్లలో తమీమ్ ఇక్బాల్ (6) విఫలమైనా... ఇమ్రూల్ కైస్ (30) మెరుగ్గా ఆడాడు. వన్‌డౌన్‌లో మోమినల్ హక్ (40)తో కలిసి రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాడు. అయితే సఫారీ బౌలర్ల ధాటికి 86 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి బంగ్లాను... ముష్ఫికర్ (65) ఆదుకున్నాడు. మహ్మదుల్లా (35), షకీబ్ (35) రాణించినా... చివరి సెషన్‌లో స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడటంతో ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.