చెస్ చాంప్స్ బాలకిషన్, ఆయూష్ | balakishan and ayush got chess titles | Sakshi
Sakshi News home page

చెస్ చాంప్స్ బాలకిషన్, ఆయూష్

Aug 8 2016 11:53 AM | Updated on Sep 4 2017 8:25 AM

తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల చెస్ టోర్నమెంట్‌లో బాలకిషన్, ఆయూష్ చాంపియన్లుగా నిలిచారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల చెస్ టోర్నమెంట్‌లో బాలకిషన్, ఆయూష్ చాంపియన్లుగా నిలిచారు. బేగంపేటలోని ఏ9 అకాడమీలో ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ తుదిరౌండ్ గేమ్‌ని బాలకిషన్ (5)... భరత్ కుమార్ (4.5)తో మ్యాచ్ డ్రా చేసుకొని విజేతగా నిలిచాడు. జూనియర్ విభాగంలో ఆయూష్ (4.5)... ధనుశ్ రెడ్డి (4.5)తో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. కానీ మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఆయూష్ విజేతగా నిలిచాడు. అనంతరం టీఎస్‌సీఏ కార్యదర్శి ఎ. వెంకటేశ్వర రావు, ఇంటర్నేషనల్ మాస్టర్ పి.డి.ఎస్ గిరినాధ్, సీనియర్ చెస్ కోచ్ రవి, ఈవెంట్ కన్వీనర్ స్రవంతి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


 ఇతర కేటగిరీల విజేతలు:
 అండర్-13 బాలికలు: 1. సాయి ప్రియ 2. శ్రేయ; అండర్-11 బాలురు: 1. సాయి మణీంద్ర, 2. ప్రభంజన్; అండర్-11 బాలికలు: 1. శ్రీయ, 2. అద్వైత; అండర్-9 బాలురు: 1. ధనుశ్ రెడ్డి, 2. సమీర్; అండర్-9 బాలికలు: 1. శ్రీ భవాగ్ని, 2. శాన్వి; అండర్-7 బాలురు: 1. లుకా జైన్, 2. సుహాస్; అండర్-7 బాలికలు: 1. రిమితా రెడ్డి, 2. అంకితా రెడ్డి.


 

Advertisement
 
Advertisement
Advertisement