breaking news
tsca
-
చెస్ చాంప్స్ బాలకిషన్, ఆయూష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల చెస్ టోర్నమెంట్లో బాలకిషన్, ఆయూష్ చాంపియన్లుగా నిలిచారు. బేగంపేటలోని ఏ9 అకాడమీలో ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ తుదిరౌండ్ గేమ్‌ని బాలకిషన్ (5)... భరత్ కుమార్ (4.5)తో మ్యాచ్ డ్రా చేసుకొని విజేతగా నిలిచాడు. జూనియర్ విభాగంలో ఆయూష్ (4.5)... ధనుశ్ రెడ్డి (4.5)తో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. కానీ మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఆయూష్ విజేతగా నిలిచాడు. అనంతరం టీఎస్‌సీఏ కార్యదర్శి ఎ. వెంకటేశ్వర రావు, ఇంటర్నేషనల్ మాస్టర్ పి.డి.ఎస్ గిరినాధ్, సీనియర్ చెస్ కోచ్ రవి, ఈవెంట్ కన్వీనర్ స్రవంతి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇతర కేటగిరీల విజేతలు: అండర్-13 బాలికలు: 1. సాయి ప్రియ 2. శ్రేయ; అండర్-11 బాలురు: 1. సాయి మణీంద్ర, 2. ప్రభంజన్; అండర్-11 బాలికలు: 1. శ్రీయ, 2. అద్వైత; అండర్-9 బాలురు: 1. ధనుశ్ రెడ్డి, 2. సమీర్; అండర్-9 బాలికలు: 1. శ్రీ భవాగ్ని, 2. శాన్వి; అండర్-7 బాలురు: 1. లుకా జైన్, 2. సుహాస్; అండర్-7 బాలికలు: 1. రిమితా రెడ్డి, 2. అంకితా రెడ్డి. -
హైదరాబాద్ బౌలర్లు విఫలం
హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నీ తొలిరోజు ఆటలో హైదరాబాద్ ఎలెవన్ బౌలర్లు విఫలమవడంతో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎస్‌సీఏ) భారీ స్కోరును చేసింది. శుక్రవారం తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీఎన్‌సీఏ ఎలెవన్ 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. భరత్ శంకర్ (119), ముకుంద్ (136) సెంచరీలతో కదం తొక్కగా... శ్రీధర్ రాజు (90), రాహుల్ (56 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ ఎలెవన్ బౌలర్లలో కిరణ్, మెహదీ హసన్, ఆకాశ్ బండారి తలో వికెట్ తీశారు.