19న బ్యాడ్మింటన్ సెలక్షన్స్ | badminton selections on 19th december | Sakshi
Sakshi News home page

19న బ్యాడ్మింటన్ సెలక్షన్స్

Dec 18 2016 11:48 AM | Updated on Sep 4 2017 11:03 PM

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ జిల్లా అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ సెలక్షన్ టోర్నీ జరుగనుంది.

సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ జిల్లా అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ సెలక్షన్ టోర్నీ జరుగనుంది. నాంపల్లిలోని ప్రభుత్వ ఎంఏఎం జూనియర్ కళాశాల వేదికగా బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మంగళవారం సరూర్‌నగర్ స్టేడియంలో ప్రారంభమయ్యే రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు ఎంపికవుతారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం బ్యాడ్మింటన్ సెక్షన్ సెక్రటరీ డి. ఆర్. అన్నా మేరీ (7013189722)ని సంప్రదించవచ్చు.

 

Advertisement
 
Advertisement
Advertisement