నాలుగో వన్డేలోనూ ఆసీస్‌దే గెలుపు 

Australia win fourth ODI on the trot against Pakistan - Sakshi

6 పరుగులతో ఓడిన పాక్‌ 

ఆబిద్‌ అలీ, రిజ్వాన్‌ శతకాలు వృథా 

దుబాయ్‌: కెరీర్‌లో తొలి వన్డే ఆడిన ఆబిద్‌ అలీ (119 బంతుల్లో 112; 9 ఫోర్లు)తో పాటు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (102 బంతుల్లో 104; 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలతో కదం తొక్కినా... పాకిస్తాన్‌ను గెలిపించలేకపోయారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 6 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌లో 4–0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (82 బంతుల్లో 98; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) 2 పరుగులతో సెంచరీని కోల్పోగా... ఓపెనర్‌ ఖాజా (78 బంతుల్లో 62; 6 ఫోర్లు), క్యారీ (67 బంతుల్లో 55; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత పాక్‌ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఆబిద్, రిజ్వాన్‌ మూడో వికెట్‌కు 144 పరుగులు జోడించి గెలుపుపై ఆశలు పెంచినా ఆబిద్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. నేడు ఆఖరి వన్డే ఇక్కడే జరుగనుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top