ఆసీస్‌కు ఆధిక్యం | Australia still with much to learn - Cricket | Sakshi
Sakshi News home page

ఆసీస్‌కు ఆధిక్యం

Jul 28 2016 12:58 AM | Updated on Sep 4 2017 6:35 AM

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది.

పల్లెకెలె (శ్రీలంక): శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. బుధవారం రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారూలకు 86 పరుగుల ఆధిక్యం లభించింది. వోజెస్ (115 బంతుల్లో 47; 3 ఫోర్లు) రాణించగా... మార్ష్ 31, స్మిత్ 30, ఖాజా 26 పరుగులు చేశారు.

66/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ను, శ్రీలంక బౌలర్లు హెరాత్ (4/49), లఖన్ సందకన్ (4/58) భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆట నిలిచే సమయానికి 2.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ఓపెనర్ కుషాల్ పెరీరా (4) ఎల్బీడబ్ల్యుగా వెనుదిరగగా... కౌశల్ సిల్వా (2 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement