భారీ స్కోరు దిశగా ఆసీస్ | ausis to build big score in sydney test | Sakshi
Sakshi News home page

భారీ స్కోరు దిశగా ఆసీస్

Jan 6 2015 9:43 AM | Updated on Sep 2 2017 7:19 PM

భారీ స్కోరు దిశగా ఆసీస్

భారీ స్కోరు దిశగా ఆసీస్

టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.

సిడ్నీ: టీమిండియాతో ఇక్కడ  మంగళవారం ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (101), రోజర్స్ (95) పరుగుల తో శుభారంభాన్నివ్వడంతో ఆసీస్ తొలి రోజు భారీ స్కోరును నమోదు చేసే దిశగా సాగుతోంది.  కెప్టెన్ స్మిత్ (28), షేన్ వాట్సన్ (10) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. లంచ్ వరకూ వికెట్లు కోల్పోని ఆసీస్ ఆ తరువాత వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్, మహ్మద్ షమీలకు తలో వికెట్ లభించింది. ఈ రోజు ఆటలో 59 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ టీ సమయానికి 242 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.

 

ఇంకా ఈ రోజు ఆటలో సుమారు ముప్ఫై ఓవర్లు ఉండటంతో ఆసీస్ భారీ స్కోరు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ చివరి టెస్టును తప్పక గెలిచి పరువు నిలుకోవాలని యత్నిస్తోంది. టెస్ట్ మ్యాచ్ లను మహేంద్ర సింగ్ ధోనీ వైదొలగడంతో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బరిలోకి దిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement