
ఆసియా క్రీడల కబడ్డీలో ఇరాన్ మహిళల జట్టు కూడా సంచలనం సృష్టించింది. వరుసగా మూడో స్వర్ణంపై గురి పెట్టిన భారత మహిళల జట్టుకు షాక్ ఇస్తూ ఇరాన్ తొలిసారి పసిడి పతకాన్ని గెల్చుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత మహిళల జట్టు 24–27తో ఇరాన్ చేతిలో ఓడిపోయి రజత పతకంతో సంతృప్తి పడింది.
గురువారం వరుసగా ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత్‌ను ఇరాన్ పురుషుల జట్టు ఓడించిన సంగతి తెలిసిందే. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించిన ఇరాన్ 26–16తో దక్షిణ కొరియాను ఓడించి మొదటిసారి విజేతగా నిలిచి టైటిల్ అందుకుంది.