అశ్విన్‌కు ‘క్యారమ్‌ బేబీ 2’ | Ashwin to 'Carrom Baby 2' | Sakshi
Sakshi News home page

అశ్విన్‌కు ‘క్యారమ్‌ బేబీ 2’

Dec 26 2016 11:59 PM | Updated on Sep 4 2017 11:39 PM

అశ్విన్‌కు ‘క్యారమ్‌ బేబీ 2’

అశ్విన్‌కు ‘క్యారమ్‌ బేబీ 2’

అంతర్జాతీయ క్రికెట్‌లో 2016 ఏడాదిని చిరస్మరణీయం చేసుకున్న భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే ఆనందంగా ముగించాడు.

చెన్నై: అంతర్జాతీయ క్రికెట్‌లో 2016 ఏడాదిని చిరస్మరణీయం చేసుకున్న భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వ్యక్తిగత జీవితాన్ని కూడా అంతే ఆనందంగా ముగించాడు. ఈ నెల 21న అతని భార్య ప్రీతి నారాయణన్‌ రెండో పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా నాలుగు రోజుల తర్వాత ప్రీతి ట్విట్టర్‌ ద్వారా సరదా వ్యాఖ్యలతో ప్రకటించింది. ‘ఈ నెల 21న మాకు క్యారమ్‌ బేబీ 2 పుట్టింది. రాష్ట్రంలో తుఫాను, చెన్నైలో చివరి టెస్టు ముగిసే వరకు ఆమె వేచి చూసింది.

భారత్‌ మ్యాచ్‌ గెలిచిన సమయంలోనైతే చేపాక్‌లోనే పాప పుడుతుందేమోననిపించింది. అయితే ఆమె తర్వాతి రోజు ఈ ప్రపంచంలోకి వచ్చింది. దీని కారణంగా అశ్విన్‌ ‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ఎంపికైన సంతోషకర క్షణాలనుంచి దృష్టి మళ్లరాదని భావించాను. అందుకే ఇప్పుడు చెబుతున్నాను’ అని ప్రీతి వెల్లడించింది. అశ్విన్‌కు ఇప్పటికే ఏడాదిన్నర వయసున్న ‘అఖీరా’ అనే అమ్మాయి ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement