అశ్విన్‌ ఫ్రాంచైజీ మారింది..

Ashwin Set To Play for Delhi Capitals In IPL 2020 - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. అతడిని 2018 సీజన్‌లో రూ.7.6 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవెన్‌ సారథ్య బాధ్యతలూ అప్పజెప్పింది. రెండు సీజన్లలో  అశ్విన్‌ జట్టు 12 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడింది. ఓ దశలో మెరుగైన ఆటతో ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచినా తర్వాత వెనుకబడింది. ఇప్పుడు ఢిల్లీ నగదు ఒప్పందంపైనే అతడిని తీసుకోనుందని సమాచారం.

‘అశ్విన్‌ ఫ్రాంచైజీ మార్పు అంశంపై బీసీసీఐ నుంచి త్వరలో ప్రకటన రానుంది. జట్టులోకి యువ స్పిన్నర్‌ను తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న పంజాబ్‌ అశ్విన్‌ను వదులుకునేందుకు సిద్ధపడింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అశ్విన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా ప్రయత్నించినా అది ముందుకు కదల్లేదని సమాచారం.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top