కాంస్య పతక పోరులో సురేఖ–వర్మ ద్వయం | Archer Jyoti Surekha to go on indefinite hunger strike | Sakshi
Sakshi News home page

కాంస్య పతక పోరులో సురేఖ–వర్మ ద్వయం

May 25 2018 2:01 AM | Updated on May 25 2018 2:01 AM

Archer Jyoti Surekha to go on indefinite hunger strike - Sakshi

అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ మరో పతకంపై దృష్టి పెట్టింది. కాంపౌండ్‌ ఈవెంట్‌ మిక్స్‌డ్‌ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్‌ వర్మ (భారత్‌) జోడీ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం రేసులో నిలిచింది.

గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ–వర్మ ద్వయం 153–155తో సోఫీ–జూలియన్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో పరాజయం పాలైంది. క్వార్టర్‌ ఫైనల్లో భారత జోడీ 155–152తో నెదర్లాండ్స్‌ ద్వయంపై నెగ్గింది. శుక్రవారం జరిగే కాంస్య పతక పోరులో బెల్జియం జంటతో సురేఖ– వర్మ జోడీ తలపడుతుంది. శుక్రవారమే జరిగే కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో చైనీస్‌ తైపీతో సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత జట్టు ఆడనుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement