
ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్-2025లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగేలతో కూడిన భారత పురుషల జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రిషబ్- వెన్నం జ్యోతిసురేఖ జోడికి రజత పతకం దక్కింది.
ఆదివారం జరిగిన ఫైనల్‌లో తొలుత భారత మెన్స్ టీమ్ ఫ్రాన్స్‌తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో కేవలం రెండు పాయింట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది. రిషబ్ అండ్ కో 235 పాయింట్లు సాధించగా ఫ్రాన్స్ 233 పాయింట్లు సాధించింది.
భారత పురుషుల జట్టు ఈ మెగా ఈవెంట్‌లో స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. మరోవైపు కాంపౌండ్ మిక్సిడ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సురేఖ, రిషబ్ యాదవ్‌లతో కూడిన భారత జట్టు తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. ఫైనల్ లో నెదర్లాండ్స్ జోడి చేతిలో 157-155 తేడాతో ఓటమి పాలయ్యారు.
కేవలం రెండు పాయింట్ల తేడాతో పసడి పతకాన్ని భారత్ కోల్పోయింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు గెలిచిన భారత ఆర్చర్‌గా ఇప్పటికే రికార్డు సాధించిన జ్యోతి సురేఖకు ఇది తొమ్మిదో పతకం కావడం విశేషం.
చదవండి: పాక్‌లో మ్యాచ్ జరుగుతుండగా ఉగ్రదాడి.. సౌతాఫ్రికా పర్యటనపై నీలినీడలు?