జింబాబ్వేకు మరో విజయం | Another victory in Zimbabwe | Sakshi
Sakshi News home page

జింబాబ్వేకు మరో విజయం

Mar 11 2016 12:09 AM | Updated on Sep 3 2017 7:26 PM

జింబాబ్వేకు మరో విజయం

జింబాబ్వేకు మరో విజయం

టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో జింబాబ్వే జట్టు దూసుకెళుతోంది.

స్కాట్లాండ్‌తో టి20 క్వాలిఫయింగ్ మ్యాచ్ 

నాగ్‌పూర్: టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో జింబాబ్వే జట్టు దూసుకెళుతోంది. గురువారం గ్రూప్ ‘బి’లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లలో బౌలర్లు మెరుగ్గా రాణించడంతో జింబాబ్వే 11 పరుగుల తేడాతో నెగ్గింది. ఇది ఈ జట్టుకు వరుసగా రెండో విజయం. ఇక 12న అఫ్ఘానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లోనూ నెగ్గితే ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 147 పరుగులు చేసింది. 67 పరుగులకు నాలుగు వికెట్లు పడిన దశలో సీన్ విలియమ్స్ (36 బంతుల్లో 53; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

ఇవాన్స్, వాట్, షరీఫ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన స్కాట్లాండ్  19.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓ దశలో జట్టు 42 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా బెరింగ్టన్ (39 బంతుల్లో 36; 1 ఫోర్; 1 సిక్స్), మొమ్‌సెన్ (27 బంతుల్లో 31; 2 ఫోర్లు) జోడి ఆరో వికెట్‌కు 51 పరుగులు జత చేసింది. చేతిలో మూడు వికెట్లున్నా మూడు ఓవర్లలో 30 పరుగులు చేయలేకపోయారు. 8 మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. చివర్లో డేవీ (13 బంతుల్లో 24; 1 ఫోర్; 2 సిక్సర్లు) వేగంగా ఆడి ఉత్కంఠ పెంచినా ఫలితం దక్కలేదు.

Advertisement
 
Advertisement
Advertisement