యూఎస్ ఓపెన్ టోర్నీలో అరుదైన రికార్డుకు చేరువలో పెన్నెటా. ఓక గ్రాండ్ స్లామ్ గెలుచుకునేందకు అత్యధిక ప్రయత్నాలు చేసిన మహిళా క్రీడాకారిణిగా.. గుర్తింపునకు అడుగు దూరంలో ఇటాలియన్ భామ.
యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభంలో ఈ రికార్డు గురించి ఎవ్వరూ ఆలోచించి ఉండరు. టెన్సిస్ ఓనమాలు తెలియని.. న్యూయార్కర్ల నుంచి క్రీడాపండితుల వరకూ అంతా సెరెనా.. క్యాలెండర్ స్లామ్ గురించే మాట్లాడారు. ఇటాలియన్ భామ రొబెర్ట్ విన్సీ ఓడి పోడంతో.. అమెరికన్ లు అంతా.. మహిళల సింగిల్స్ గురించి చర్చించుకోవడం మానేశారు.
అయితే.. న్యూయార్క్ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం జరిగే.. ఆల్ ఇటాలియన్ ఉమెన్స్ ఫైనల్ లో మరో రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో పెన్నెట్టా గెలిస్తే.. గ్రాండ్స్ స్లామ్ మహిళల ఛాంపియన్ షిప్ చరిత్రలో.. అత్యధిక ప్రయత్నాల తర్వాత టైటిల్ గెలిచిన రికార్డు సాధిస్తుంది. 49 గ్రాండ్ స్లామ్ టోర్నీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న పెన్నెటా.. తొలిసారి ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్ కు చేరింది. గతంలో ఈ రికార్డు ఫ్రెంచ్ ప్లేయర్ మారియన్ బర్టోలీ(47) పేరిట ఉంది. కాగా.. మారియన్ కంటే.. పెన్నెటా రెండు టోర్నీ(49)లు అధికంగా తీసుకుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు కూడా పెన్నెటా కి అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ తొమ్మిది సార్లు పెన్నెటా, విన్సీలు ముఖా ముఖి తలపడగా.. 5 సార్లు పెన్నెటా గెలుపొందింది. మరి యూఎస్ ఓపెన్ లో పెన్నెటా రికార్డు సృష్టిస్తుందో.. విన్సీ లెక్క సరిచేసి.. చరిత్ర సృష్టిస్తుందో మరికాసేపట్లో తేలనుంది.