జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
	క్వార్టర్స్‌లో ఓడిన తెలంగాణ
	 జాతీయ సబ్ జూ. బాస్కెట్‌బాల్
	
	 సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ బాలుర జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆతిథ్య తెలంగాణ జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓడింది. ‘శాట్స్’ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ 63-58తో చత్తీస్‌గఢ్‌పై విజయం సాధించింది. ఏపీ జట్టులో షేక్ అహ్మద్ (27) రాణించాడు. భార్గవ్ 11, శ్రీతమ్ త్రిపాఠి 10 పారుుంట్లు చేశారు.
	తెలంగాణ జట్టు 42-63తో మధ్యప్రదేశ్ చేతిలో పరాజయం చవిచూసింది. తెలంగాణ తరఫున రోహిత్ 10, షేక్ ఖాజావలి 9 పాయింట్లు చేశారు. మధ్యప్రదేశ్ జట్టులో విరాట్ కక్కర్ (33) చెలరేగాడు. మిగతా మ్యాచ్‌ల్లో హరియాణా 76-54తో ఉత్తరప్రదేశ్‌పై, రాజస్తాన్ 82-60తో పంజాబ్‌పై గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్లో కేరళ 50-41తో రాజస్తాన్‌పై, తమిళనాడు 67-41తో కర్ణాటకపై, మహారాష్ట్ర 48-30తో మధ్యప్రదేశ్‌పై, చత్తీస్‌గఢ్ 49-35తో ఉత్తరప్రదేశ్‌పై విజయం సాధించాయి.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
