పొలార్డ్, జెన్నా... మధ్యలో పాండ్యా | And Hardik Pandya Makes 3. Cricketer Crashes Pollards Pic With Wife | Sakshi
Sakshi News home page

పొలార్డ్, జెన్నా... మధ్యలో పాండ్యా

May 24 2016 10:16 AM | Updated on Sep 4 2017 12:50 AM

పొలార్డ్, జెన్నా... మధ్యలో పాండ్యా

పొలార్డ్, జెన్నా... మధ్యలో పాండ్యా

సహచర ఆటగాడు హార్థిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

సహచర ఆటగాడు హార్థిక్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఫొటోలో కనిపించేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని అతడు వదులుకోడని ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. అందుకు తగిన ఫొటో కూడా పెట్టాడు.

తమ పెళ్లై 11 ఏళ్లు పూర్తై సందర్భంగా పొలార్డ్ తన భార్య జెన్నాను అప్యాయంగా కౌలిగించుకున్నాడు. అదే సమయంలో వెనకాల నుంచి పొలార్డ్ ను పాండ్యా ఆలింగనం చేసుకున్నాడు. పానకంలో పుడకలా పాండ్యా తమ మధ్యకు వచ్చినప్పుటికీ జెన్నా ఏమనకుండా నవ్వుతూ ఉండిపోయింది. ఈ సరదా ఫొటోను పొలార్డ్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ఫొటోలో పడేందుకు పాండ్యా ప్రయత్నిస్తుంచాడని సరదా కామెంట్ కూడా పెట్టాడు.

పొలార్డ్-జెన్నా దంపతులతో సోదరుడు క్రునాల్ పాండ్యా, తాను కలిసి దిగిన ఫొటోను అంతకుముందు హార్థిక పాండ్యాకు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కాగా, ఐపీఎల్-9లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ కు చేరకపోవడంతో వీరికి తీరిక దొరికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement