టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీలో ఆనంద్‌ శుభారంభం 

Anand is in the Tata Steel Masters Tournament - Sakshi

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ శుభారంభం చేశాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ పట్టణంలో శనివారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ఆనంద్‌ 53 ఎత్తుల్లో మాక్సిమ్‌ మత్లాకోవ్‌ (రష్యా)ను ఓడించాడు.

పీటర్‌ స్విద్లెర్‌ (రష్యా)తో జరిగిన మరో గేమ్‌లో భారత్‌కే చెందిన ఆదిబన్‌ 33 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఇదే టోర్నీ చాలెంజర్స్‌ విభాగంలో పోటీపడుతున్న ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక తొలి గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. అమీన్‌ బాసిమ్‌ (ఈజిప్ట్‌)తో జరిగిన గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.    

Back to Top