తొమ్మిదో స్థానంలో ఆనంద్ | Anand joint ninth after sedate start in World Rapid | Sakshi
Sakshi News home page

తొమ్మిదో స్థానంలో ఆనంద్

Jun 18 2014 1:09 AM | Updated on Sep 2 2017 8:57 AM

తొమ్మిదో స్థానంలో ఆనంద్

తొమ్మిదో స్థానంలో ఆనంద్

ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యాక భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడున్నర పాయింట్లతో సంయుక్తంగా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.

 దుబాయ్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యాక భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడున్నర పాయింట్లతో సంయుక్తంగా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఇవాన్ లోపెజ్ (స్పెయిన్), మాక్సిమ్ మత్లకోవ్ (రష్యా), విక్టర్ లాజ్నికా (రుమేనియా)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్... సందీపన్ చందా (భారత్), వ్లాదిమిర్ ఫెదోసీవ్ (రష్యా)లపై గెలిచాడు.
 
 ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి ఐదు రౌండ్ల నుంచి మూడు పాయింట్లు రాబట్టాడు. జూడిత్ పోల్గర్ (హంగేరి) చేతిలో ఓడిపోయిన హరికృష్ణ... ఇవాన్ సొకోలోవ్ (నెదర్లాండ్స్), లారెంట్ ఫ్రెసినెట్ (ఫ్రాన్స్) గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని... ఎవగెని నజర్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో నెగ్గాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement