తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం | Amla's solid century headlines South Africa's win | Sakshi
Sakshi News home page

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం

Aug 21 2015 12:14 AM | Updated on Sep 3 2017 7:48 AM

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం

తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో 20 పరుగులతో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో

సెంచూరియన్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌లో 20 పరుగులతో విజయం సాధించింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (126 బంతుల్లో 124; 13 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. రోసౌ (112 బంతుల్లో 89; 6 ఫోర్లు; 3 సిక్సర్లు)తో కలిసి ఆమ్లా రెండో వికెట్‌కు 185 పరుగులు జత చేశాడు. వీరిద్దరు మినహా మిగతావారంతా విఫలమయ్యారు. మిల్నే, మెక్లెనెగాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కివీస్ 48.1 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లాథమ్ (80 బంతుల్లో 60; 4 ఫోర్లు; 1 సిక్స్), విలియమ్సన్ (69 బంతుల్లో 47; 4 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నారు. స్టెయిన్, ఫిలాండర్, తాహిర్, వీస్ రెండేసి వికెట్లు తీశారు. ఆమ్లాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే 23న జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement