భారత్-పాక్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ | Amitabh Bachchan to sing National Anthem before India-Pak match | Sakshi
Sakshi News home page

భారత్-పాక్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్

Mar 15 2016 8:15 PM | Updated on Sep 3 2017 7:49 PM

భారత్-పాక్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్

భారత్-పాక్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్

టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.

కోల్ కతా: టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ నెల 19న ఈడెన్ గార్డెన్ లో మ్యాచ్ ప్రారంభానికి ముందు బిగ్ బీ జాతీయగీతం ఆలపించనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.

తమ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చొరవతోనే అమితాబ్ మ్యాచ్ కు రావడానికి ఒప్పుకున్నారని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు అమితాబ్ తో జాతీయ గీతం పాడించాలని ఎప్పటినుంచో సౌరవ్ గంగూలీ అనుకుంటున్నారని తెలిపారు. పాకిస్థాన్ జట్టు కూడా క్లాసికల్ సింగర్ షఫాకత్ అమనాత్ అలీతో తమ జాతీయ గీతం పాడించాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement