అతడు భవిష్యత్‌ ఆశా కిరణం: రహానే

Ajinkya Rahane Praises The Young Cricketer Prithvi Shaw - Sakshi

సాక్షి, రాజ్‌కోట్‌: భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే సెలక్టర్లు టీమిండియాలో యువ ఆటగాళ్లకు  అవకాశాలు కల్పిస్తున్నట్లు టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే అభిప్రాయపడ్డారు. ఆతిథ్య వెస్టిండీస్‌ జట్టును తేలికగా తీసుకోవడం లేదని.. కానీ టీమిండియా బలాబలాలను పరీక్షిస్తున్నామని, బలమైన జట్టుతోనే దిగుతున్నామని తెలిపాడు. యువ ఆటగాళ్లు మయాంక్‌ అగర్వాల్‌, మహ్మద్‌ సిరాజ్‌​, పృథ్వీ షాలపై ప్రశంసలు జల్లు కురిపించారు. టీమిండియాలో చోటు దక్కించుకున్న యువ ఆటగాళ్లకు విండీస్‌తో టెస్టు సిరీస్‌ చాలా ఉపయోగపడుతుందని వివరించాడు. వారేంటో నిరూపించుకోవాల్సిన సమయం, అవకాశం వచ్చిందన్నాడు.

డొమెస్టిక్‌ క్రికెట్‌లో వారి ఆటతీరు అమోఘమని కొనియాడాడు. ముఖ్యంగా పృథ్వీ షా రోజురోజుకి మరింత రాటు దేలుతున్నాడని ప్రశంసించాడు. ముంబై తరుపున అతడు ఆడిన ఆటను దగ్గర్నుంచి పరిశీలించానని వివరించాడు. భవిష్యత్‌లో గొప్ప క్రికెటర్‌గా పృథ్వీ గుర్తింపు తెచ్చుకుంటాడిన, ఆ నమ్మకం అతడిపై ఉందని రహానే ధీమా వ్యక్తం చేశాడు. విండీస్‌తో రెండు​ టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్‌ అసోషియేషన్‌ మైదానంలో రేపటి(గురువారం) నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. రెండో టెస్టు ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top