హార్దిక్‌కు కావాలంటే కోచింగ్‌ ఇస్తా: పాక్‌ మాజీ క్రికెటర్‌

Abdul Razzaq Says I Can Make Hardik The Best All Rounder - Sakshi

మాంచెస్టర్‌: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ ట్విటర్‌ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు రెండు వారాలు కోచింగ్‌ అవకాశం ఇస్తే హార్దిక్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు. అతడిని గొప్ప ఆల్‌రౌండర్‌గా చూడాలని బీసీసీఐ భావిస్తే తనను సంప్రందించవచ్చని తెలిపాడు. యూఏఈ వంటి తటస్థ వేదికల్లో పాండ్యాకు కోచింగ్‌ ఇవ్వడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రజాక్‌ అన్నాడు. 

‘ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ఆటను క్షుణ్ణంగా పరిశీలించాను. అతడి బ్యాటింగ్‌, బౌలింగ్‌లో చాలా లోపాలున్నాయి. హిట్టింగ్‌ చేయడానికి బంతిని బలంగా బాదే క్రమంలో అతడి శరీరం అదుపుతప్పుతుంది. ఫుట్‌వర్క్‌ కూడా అంతగా బాగోలోదు. నాకు రెండు వారాలు కోచింగ్‌ అవకాశమిస్తే హార్దిక్‌ పాండ్యాను గొప్ప ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా. తటస్థ వేదికల్లో పలు సెషన్‌లు నిర్వహించడానికి కూడా నేను సిద్దం. హార్దిక్‌ను గొప్ప ఆల్‌రౌండర్‌గా చూడాలని బీసీసీఐ భావిస్తే నన్ను ఎప్పుడైన సంప్రదించవచ్చు’అంటూ రజాక్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.
ఇక రజాక్‌ ట్వీట్‌లపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘ఉద్యోగం కావాలని బీసీసీఐని నేరుగా అడగొచ్చు కదా అంటూ’చురకలు అంటిస్తున్నారు. అయితే రజాక్‌ గొప్ప ఆల్‌రౌండర్‌ అని అతడి కోచింగ్‌లో పాండ్యా ఇంకా మెరుగయ్యే అవకాశం ఉందని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇక వెస్టిండీస్‌పై విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్‌ను కోహ్లి సేన ఢీ కొట్టబోతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top