
దక్షిణాఫ్రికాను వీడిన మరో క్రికెటర్
తన సహచర ఆటగాళ్లు కైల్ అబాట్, రిలీ రోసౌ మాదిరిగానే దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ కౌంటీ క్లబ్ కోసం జాతీయ జట్టుకు వీడ్కోలు పలికాడు.
లండన్: తన సహచర ఆటగాళ్లు కైల్ అబాట్, రిలీ రోసౌ మాదిరిగానే దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ కౌంటీ క్లబ్ కోసం జాతీయ జట్టుకు వీడ్కోలు పలికాడు. ససెక్స్ తరఫున ఈ 31 ఏళ్ల ఆటగాడు కోల్‌ప్యాక్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దీంతో తమ జాతీయ జట్టుకు దూరం కావాల్సి ఉంటుంది. అయితే నాలుగేళ్ల పాటు కౌంటీల్లో ఆడాక ఇంగ్లండ్ జట్టులో ఆడేందుకు వీరికి అవకాశం ఉంటుంది. గతేడాది సీజన్‌లోనూ ససెక్స్‌కు ఆడిన వీజ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆరు వన్డేలు, 20 టి20 మ్యాచ్‌లు ఆడాడు. సుదీర్ఘకాలం ఒప్పందంపై కౌంటీల్లో ఆడబోతున్నందుకు సంతోషంగా ఉందని వీజ్ అన్నాడు. గత వారం అబాట్, రోసౌ హాంపషైర్‌తో డీల్ కుదుర్చుకున్నారు.